Underwear Gang | మహారాష్ట్రలోని నాసిక్ (Nashik)లో చెడ్డీ గ్యాంగ్ (Underwear Gang) హల్చల్ చేసింది. మలేగావ్ (Malegaon) ప్రాంతంలో ఓ ఇంటిని దోచుకుంది. రూ.5 లక్షల విలువైన బంగారం (Gold), అరటిపళ్లను (Bananas) చోరీ చేసింది. ఈ ముఠా ఓ ఇంట్లోకి చొరబడుతున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఇంట్లోకి చొరబడ్డ ఈ ‘చెడ్డీ ముఠా’ 70 గ్రాముల విలువైన బంగారం, అరటిపళ్లను దోచుకెళ్లింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.5లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా, మలేగావ్ ప్రాంతంలో గత వారం ‘గౌన్’ గ్యాంగ్ (gown gang) కలకలం సృష్టించింది. ఈ ముఠా మహిళల వస్త్రాలను ధరించి నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని చోరీకి పాల్పడింది. పలు ఇళ్లను దోచుకుంది. అంతేకాకుండా ఓ ఆలయంలోని హుండీలోని సొమ్మును కూడా అపహరించుకెళ్లింది. ‘చెడ్డీ’, ‘గౌన్’ ముఠాల వరుస చోరీలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
Also Read..
Rs 2,000 Notes | రూ.2వేల నోట్లు 97.96 శాతం బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చేశాయ్ : ఆర్బీఐ
Medigadda barrage | మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద.. 85 గేట్లు ఎత్తి నీటి విడుదల
Audi | పర్వతం ఎక్కుతూ 10000 అడుగుల నుంచి కిందకు పడిపోయాడు : ఆడి ఇటలీ బాస్ విషాదాంతం