Rs 2,000 Notes | చలామణి నుంచి దాదాపు 97.96 శాతం మేర రూ.2వేల నోట్లు (Rs 2,000 Notes) తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,261 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.
2023 మే 19న చలామణి నుంచి రూ.2,000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు (Denomination Banknotes) ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు చలామణిలో ఉన్న ఈ నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లు. ఇదిలావుంటే నిరుడు అక్టోబర్ 7దాకా దేశంలోని అన్ని బ్యాంక్ శాఖల్లో రూ.2,000 నోట్ల మార్పిడి జరిగింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మాత్రమే ఈ మార్పిడికి వీలుంది.
అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని ఆర్బీఐ శాఖల్లో రూ.2వేల నోట్లు మార్చుకోవచ్చు. కాగా, కేంద్ర ప్రభుత్వం నవంబర్ 2016లో రూ. 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అప్పుడు చలమాణిలో ఉన్న రూ. 1,000, రూ.500 నోట్లను రద్దు చేసి రూ.2వేల నోట్లను చలామణిలోకి తెచ్చింది.
Also Read..
Suicide bomber | కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. ఆరుగురు మృతి
Sheikh Hasina | షేక్ హసీనాపై మరో ఐదు హత్య కేసులు నమోదు
Prakasham Barrage | ప్రకాశం బ్యారేజి అనుకున్నంతగా దెబ్బతినలేదు.. ఇంజనీరింగ్ నిపుణులు