Suicide bomber | ఆఫ్ఘానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది (Suicide bomber). రాజధాని కాబూల్ (Kabul)లో జరిగిన ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు.
కాబూల్‌లోని నైరుతి ఖలా బక్తియార్ (Qala Bakhtiar) పరిసర ప్రాంతంలో సోమవారం ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు కాబూల్ పోలీసు చీఫ్ అధికార ప్రతినిధి ఖలీద్ జద్రాన్ తెలిపారు. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మృతుల్లో మహిళ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 13 మంది గాయపడ్డారని.. వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.
కాగా, 2021 నుంచి ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక్కడ తాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసే ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ తరచూ స్కూళ్లు, ఆసుపత్రులు, మసీదులపై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతోంది. అయితే, తాజాగా జరిగిన ఆత్మాహుతి దాడికి ఇప్పటి వరకూ ఎవరూ బాధ్యత వహించలేదు.
Also Read..
Sheikh Hasina | షేక్ హసీనాపై మరో ఐదు హత్య కేసులు నమోదు
Arthritis | కీళ్లవాతానికి హైడ్రోజెల్.. అభివృద్ధి చేసిన చైనా శాస్త్రవేత్తలు
Melania Trump | సొంత ఇంట్లో ట్రంప్‌కు మద్దతు కరువు.. కమల హారిస్ విజయం కోసం ఎదురుచూస్తున్న మెలానియా!