Arthritis | బీజింగ్, సెప్టెంబర్ 2: కీళ్ల నొప్పులు (ఆర్థరైటిస్) లేదా కీళ్లవాతం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని బాధిస్తున్న ఆరోగ్య సమస్య. ముఖ్యంగా 40 ఏండ్లు దాటిన వాళ్లలో ఈ సమస్య ఎక్కువగా కనపడుతున్నది. కీళ్లవాతంలో ‘ఆస్టియో ఆర్థరైటిస్’ అనే ఆరోగ్య సమస్యకు పరిష్కారం చూపే అడ్వాన్స్డ్ లూబ్రికెంట్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
తాము తయారుచేసిన హైడ్రోజెల్.. దెబ్బతిన్న మృదులాస్తి (ఎముకల్లోని గుజ్జు)ని టార్గెట్ చేసుకొని పనిచేస్తుందని, దానిని తిరిగి పునరుద్ధరణ చేసే విధంగా పనిచేస్తుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది. హైడ్రోజెల్ వాడటం ద్వారా ఆర్థరైటిస్ వ్యాధి తీవ్రం కాకుండా అడ్డుకోవచ్చునని సైంటిస్టుల అధ్యయనం పేర్కొన్నది. షాంఘైలోని అడ్వాన్స్డ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు దీనిని తయారుచేశారు.