Soldiers | దాయాది పాకిస్థాన్ (pakistan)లో సైన్యమే లక్ష్యంగా మరోసారి దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది పాక్ సైనికులు (Soldiers) ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతిగా పాక్ ఆర్మీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో 19 మంది ఉగ్రవాదులు హతమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
పాక్ సైనిక కాన్వాయ్‌పై మిలిటెంట్ల బాంబు దాడికి పాల్పడ్డారు. పక్కా ప్రణాళికతో చేసిన ఈ దాడిలో లెఫ్టినెంట్ కల్నల్, మేజర్ సహా మొత్తం 11 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి అఫ్గాన్-పాక్ సరిహద్దు నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) బాధ్యత వహించినట్లు సమాచారం. దీంతో రంగంలోకి దిగిన పాక్ సైన్యం.. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రావిన్స్‌లో గల ఒరాక్జాయ్ జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో 19 మంది ఉగ్రవాదులను (Terrorists) మట్టుబెట్టినట్లు స్థానిక మీడియా నివేదించింది.
Also Read..
Sundar Pichai | అదృష్టంగా భావిస్తున్నా.. వారికి నోబెల్ బహుమతి వరించడంపై సుందర్ పిచాయ్ ఆనందం
Sergio Gor: భారత్‌కు అమెరికా అంబాసిడర్‌గా సెర్గియో గోర్
Diwali | అమెరికాలో దీపావళికి సెలవు.. అధికారికంగా ప్రకటించిన కాలిఫోర్నియా