వాషింగ్టన్: భారత్‌కు అంబాసిడర్‌గా సెర్గియా గోర్(Sergio Gor)ను కన్ఫర్మ్ చేసింది అమెరికా. సేనేట్‌లో మంగళవారం 38 ఏళ్ల గోర్‌ను ఏకగ్రీవంగా నామినేట్ చేశారు. 51 మంది సేనేటర్లు అనుకూలంగా, 47 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం షట్డౌన్లో ఉన్నా.. భారత్‌కు సెర్గియో గోర్‌ను అంబాసిడర్‌గా అమెరికా నియమించింది. దక్షిణాసియా దేశాల వ్యవహారాల శాఖ మంత్రిగా పౌల్ కపూర్‌ను నామినేట్ చేశారు. సింగపూర్‌కు అంజనీ సిన్హాను అంబాసిడర్‌గా అమెరికా ప్రకటించింది.
అమెరికా, భారత్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని సెర్గియో గోర్ అభిప్రాయపడ్డారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని, ఆ దేశం వల్ల ప్రాంతీయ ప్రాబల్యం పెరుగుతందన్నారు. భారత్‌తో భాగస్వామ్యం నేపథ్యంలో అమెరికా ప్రయోజనాల గురించి వివరించనున్నట్లు చెప్పారు. అమెరికా, ఇండియా మధ్య వాణిజ్య సంబంధాల వల్ల అమెరికా పోటీతత్వం పెరుగుతోందని, ఇతర దేశాలపై చైనా ఆర్థిక ప్రభావం కూడా తగ్గుతుందని గోర్ తెలిపారు.
ప్రాంతీయ స్థిరత్వం, భద్రత అంశాల్లో భారత పాత్రను విస్మరించలేమని ఆయన అన్నారు. దక్షిణాసియా ప్రాంతం స్థిరంగా ఉండాలన్నది అమెరికా ఆకాంక్ష అని తెలిపారు.