Sundar Pichai | ఈ ఏడాది భౌతికశాస్త్రం (Physics)లో ముగ్గురు శాస్త్రవేత్తలకు (Scientists) నోబెల్ బహుమతి (Nobel Prize) దక్కింది. జాన్ క్లార్క్ (John Clarke), మిషెల్ డెవోరెట్ (Michel Devoret), జాన్ ఎం మార్టినిస్ (John Martinis)లకు సంయుక్తంగా అవార్డును ప్రకటించారు. వీరికి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) అభినందనలు తెలిపారు.
ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సంభవించే ఎనర్జీ క్వాంటిజేషన్‌పై చేపట్టిన డిస్కవరీకి గుర్తింపుగా వారిని ఈ పురస్కారం వరించింది. ముగ్గురిలో ఇద్దరు గూగుల్ సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కావడం విశేషం. మిషెల్ డెవోరెట్.. గూగుల్ క్వాంటమ్ ఏఐ ల్యాబ్‌లో హార్డ్‌వేర్ చీఫ్ సైంటిస్ట్‌గా, జాన్ మార్టినిస్ హార్డ్‌వేర్ టీమ్‌కి చాలా ఏళ్లుగా నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో వారికి ఈ అత్యున్నత పురస్కారం దక్కడంపై సుందర్ పిచాయ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
‘భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లకు అభినందనలు. మిషెల్ మా క్వాంటమ్ ఏఐ ల్యాబ్‌లో హార్డ్‌వేర్ చీఫ్ సైంటిస్ట్‌గా, జాన్ మార్టినిస్ చాలా ఏళ్లుగా హార్డ్‌వేర్ టీమ్‌కి నాయకత్వం వహించారు. ఐదు మంది నోబెల్ గ్రహీతలు ఉన్న కంపెనీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ సుందర్ పిచాయ్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
Congrats to Michel Devoret, John Martinis, and John Clarke on the Nobel Prize in Physics. 🔬🥼 Michel is chief scientist of hardware at our Quantum AI lab and John Martinis led the hardware team for many years.
Their pioneering work in quantum mechanics in the 1980s made recent…
— Sundar Pichai (@sundarpichai) October 7, 2025
Also Read..
2025 Nobel Prize in Physics: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ పురస్కారం
Salaries Hike | వచ్చే ఏడాది జీతాల్లో 9% పెరుగుదల : సర్వే
Gold Prices | బంగారం ఆల్‌టైమ్ హై.. తులం రూ.1.26 లక్షలు