Salaries Hike | ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించినప్పటికీ.. వినియోగం, పెట్టుబడులు, విధానపరమైన మద్దతు కారణంగా వచ్చే ఏడాది భారత్ (India)లో ఉద్యోగుల జీతాలు 9 శాతం పెరిగే అవకాశం (Salaries Hike) ఉంది. Aon యాన్యువల్ శాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే (Annual Salary Increase and Turnover Survey 2024-25 India) ద్వారా ఈ విషయం వెల్లడైంది. 2025లో నమోదైన 8.9 శాతం జీతాల వృద్ధి కంటే.. వచ్చే ఏడాది జీతాలు సుమారు 9 శాతం పెరుగుతాయని Aon సర్వే అంచనా వేసింది.
AON భారత్లోని దాదాపు 1,060 సంస్థల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 2026లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు 10.9 శాతం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు 10 శాతం చొప్పున జీతాలు పెంచే అవకాశం ఉన్నట్లు తేలింది. అయితే టెక్నాలజీ కన్సల్టింగ్ రంగంలో జీతాల వృద్ధి గతేడాదితో పోలిస్తే కొంత తగ్గుదల కనిపిస్తోంది. ఎగుమతులు తగ్గడం, ఏఐ (కృత్రిమ మేధస్సు) ప్రభావం కారణంగా టెక్నాలజీ కన్సల్టింగ్ రంగాలు మాత్రం జీతాల పెంపు 6.5 శాతానికే పరిమితం చేయనున్నాయి. 2025 ఐటీ కంపెనీలు 7 శాతం జీతాల పెరుగుదలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఆటోమోటివ్, వాహనాల తయారీలో జీతాల పెంపు 9.6 శాతంగా అంచనాలు ఉన్నాయి. ఇంజినీరింగ్ డిజైన్ సేవల్లో (9.7 శాతం), రిటైల్ (9.6 శాతం), లైఫ్ సైన్సెస్ (9.6 శాతం) జీతాల పెరుగుదల ఉండే అవకాశం ఉందని సదరు సర్వే వెల్లడించింది.
Also Read..
Gold Prices | బంగారం ఆల్టైమ్ హై.. తులం రూ.1.26 లక్షలు
Tata Group | టాటా గ్రూప్లో ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..?