Yuzvendra Chahal | టీమ్ఇండియా క్రికెటర్ యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమ, పెళ్లి, విడాకులు, వివాదాలు, ఆరోపణలతో వీరిద్దరూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట ఈ ఏడాది మార్చిలో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి తమ బంధం గురించి ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. చాహల్‌తో తన వివాహ బంధం గురించి ధనశ్రీ ఇటీవలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ బంధం మొదటి నుంచీ ఇబ్బందుల్లోనే ఉందని పేర్కొన్నారు. వివాహం జరిగిన రెండు నెలల్లోనే చాహల్ మోసం (cheating) బయటపడిందంటూ చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ధనశ్రీ ఆరోపణలపై చాహల్ తాజాగా స్పందించారు. చీటింగ్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఓ క్రీడాకారుడిని. ఎవరినీ మోసం చేయను. నాకు పెళ్లై 4.5 సంవత్సరాలైంది. పెళ్లైన రెండు నెలల్లోనే మోసం చేస్తే ఆ బంధం ఇన్నేళ్లు ఎలా కొనసాగుతుంది..? ’ అంటూ ప్రశ్నించారు. ‘నేను ఈ అధ్యాయాన్ని మర్చిపోయాను. ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అంశంపై వంద కథనాలు వ్యాపిస్తాయి. అయితే, నిజమేంటన్నది కొందరికే తెలుసు. పెళ్లి అధ్యాయం ముగిసింది. దాని గురించి నేను మళ్లీ ప్రస్తావించదలచుకోలేదు. ప్రస్తుతం నేను జీవితం, ఆటపై దృష్టి పెట్టాను’ అని చెప్పుకొచ్చారు. ఇక రిలేషన్షిప్ స్టేటస్ గురించి చాహల్ స్పందిస్తూ.. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని స్పష్టం చేశారు.
దంత వైద్యురాలైన ధనశ్రీ 2020 డిసెంబర్ 22న చాహల్‌ను వివాహం చేసుకుంది. కొరియోగ్రాఫర్‌గా, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ధనశ్రీ. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ ఇన్‌స్టాలో రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నారు. అయితే, ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్థలు విడాకులకు దారి తీశాయి. 2020లో వీరి వివాహం జరగగా 2022 నుంచే ఈ ఇద్దరూ విడివిడిగా ఉంటున్న ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో ముంబై ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఈ ఏడాది మార్చి 20న వీరికి విడాకులు మంజూరయ్యాయి.
Also Read..
Karnataka: పిక్నిక్లో విషాదం.. డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే
Massive Jam | ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్లపైనే పడిగాపులు