Karnataka: పిక్నిక్లో విషాదం.. డ్యామ్ గేటు తెరవడంతో ఆరుగురు మృతి
Karnataka : కర్నాటకలోని తుమకూరులో విషాదం చోటుచేసుకున్నది. మర్కోనహల్లి డ్యామ్ గేట్లు తెరవడంతో ఆ నీటి ప్రవాహంలో ఆరు మంది కొట్టుకుపోయారు. ఒకర్ని రెస్క్యూ చేశారు.
బెంగుళూరు: కర్నాటక(Karnataka)లోని తుమకూరులో విషాదం చోటుచేసుకున్నది. మర్కోనహల్లి డ్యామ్ గేట్లు తెరవడంతో ఆ నీటి ప్రవాహంలో ఆరు మంది కొట్టుకుపోయారు. తుమకూరు ఎస్పీ అశోక్ కేవీ ఈ ఘటన గురించి వివరించారు. పిక్నిక్లో భాగంగా 15 మంది డ్యామ్ వద్దకు వెళ్లారు. దీంట్లో ఏడు మంది చిన్నారులు, మహిళలు నీటిలోకి ప్రవేశించారు. అయితే అకస్మాత్తుగా సైఫన్ సిస్టమ్ తెరుచుకున్నది. ఒక్కసారిగా నీళ్లు డ్యామ్ నుంచి ప్రవహించాయి. శక్తివంతంగా వచ్చిన ఆ వరదతో నీటిలో ఉన్న ఏడుగురు కొట్టుకుపోయారు. పోలీసులు, రెస్క్యూ బృందాలు ఆ ప్రాంతానికి హుటాహుటిన చేరుకున్నాయి. అయితే నవాజ్ అనే వ్యక్తిని రెస్క్యూ చేశాడు. ఆదిచుంచనగిరి ఆస్పత్రిలో అతన్ని చేర్చారు. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మరో నలగురి కోసం గాలిస్తున్నారు. బాధితులందరూ మహిళలు, అమ్మాయిలే ఉన్నారు. అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడం వల్లే ఈ ఘటన జరిగినట్లు డ్యామ్ ఇంజినీర్లు చెబుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

