Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే
Karur stampede | తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay) నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట (Karur stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.
Karur stampede | తమిళనాడులోని కరూర్‌లో టీవీకే (TVK) చీఫ్ విజయ్ (Actor Vijay) నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట (Karur stampede) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 60 మందికిపైగా గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై సిట్ (SIT) దర్యాప్తునకు మద్రాసు హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది. సిట్ దర్యాప్తును దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేసింది.
ఐపీఎస్ అధికారి అశ్రా గార్గ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను టీవీకే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఘటనపై దర్యాప్తునకు హైకోర్టు రాష్ట్ర పోలీసు అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. తమ పార్టీ పట్ల సిట్ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు (independent probe) జరిపించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
కాగా, కరూర్ ఘటన విషయంలో విజయ్ తీరును మద్రాసు హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. తొక్కిసలాట జరిగిన వెంటనే టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ అక్కడ నుంచి మాయం కావడం, ఆయనపై ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఇదేం రాజకీయ పార్టీ అంటూ టీవీకేని విమర్శించిన జస్టిస్ ఎన్ సెంథిల్‌కుమార్ తొక్కిసలాట మరణాల తర్వాత అక్కడి నుంచి ఆ పార్టీకి చెందిన బాధ్యులందరూ పారిపోయారని, ఎవరూ బాధ్యతను తీసుకోలేదని మండిపడ్డారు. ముఖ్యంగా పిల్లలు, మహిళలు మరణించడాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి టీవీకే వ్యవహార శైలిని ఖండించారు.
దుర్ఘటన పట్ల టీవీకే కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, ఆ పార్టీ నాయకుడి మానసిక స్థితికి ఇది అద్దం పడుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌ని తిరస్కరించిన కోర్టు సీనియర్ ఐపీఎస్ అధికారి, నార్త్ జోన్ ఐజీ అస్రా గర్గ్ నేతృత్వంలో సిట్‌ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై ‘సిట్’ దర్యాప్తు ఆదివారం మొదలైంది. సిట్‌లో తనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ స్థాయి అధికారులు సహా 11మంది పోలీసు అధికారులు ఉన్నారని సిట్ ప్రధాన అధికారి గార్గ్ చెప్పారు. ఘటనాస్థలాన్ని సిట్ అధికారులు పరిశీలించారు.
Also Read..
Massive Jam | ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. నాలుగు రోజులుగా రోడ్లపైనే పడిగాపులు
Mohamed Hussein: రష్యా ఆర్మీకి పనిచేస్తున్న భారతీయుడిని అరెస్టు చేసిన ఉక్రెయిన్
Vijay | విజయ్ రోడ్ షోలో 41 మంది మృతి.. బాధితులని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి లేఖ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

