Massive Jam | దేశంలోని అత్యంత రద్దీ జాతీయ రహదారుల్లో ఒకటైన ఢిల్లీ-కోల్కతా హైవేపై ప్రయాణం నరకంగా మారింది. బీహార్లోని ఔరంగాబాద్-రోహ్తాస్ మధ్య ఢిల్లీ-కోల్కతా జాతీయ రహదారిపై(Delhi Kolkata Highway) భారీగా ట్రాఫిక్ జామ్ (Massive Jam) ఏర్పడింది. భారీ ట్రక్కులు సహా పలు వాహనాలు గత నాలుగు రోజులుగా రోడ్డుపైనే నిలిచిపోయాయి (Vehicles Stuck For 4 Days).
బీహార్ (Bihar)లోని రోహ్తాస్ (Rohtas) జిల్లాలో గత శుక్రవారం కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఈ దుస్థితి తలెత్తింది. భారీ వర్షాల కారణంగా.. జాతీయ రహదారి 19 (National Highway 19)పై నిర్మాణంలో ఉన్న ఆరు లైన్ల రహదారిపైకి నీరు చేరింది. డైవర్షన్లు, సర్వీస్ రోడ్లను సైతం వర్షం నీరు ముంచెత్తింది. దీంతో వాహనాలు ముందుకు వెళ్లలేని దుస్థితి. వందలాది వాహనాలు దాదాపుగా బంపర్-టు-బంపర్ ఆగిపోయాయి. దీనికితోడు అధికార యంత్రాగంలో సమన్వయలోపం, పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది.
रोहतास, बिहार
दिल्ली-कोलकाता हाईवे पर बीते 4 दिनों से लंबा जाम, NH पर 40KM तक फैला जाम
बीते चार दिनों से लगा जाम रोहतास जिले से लेकर औरंगाबाद जिले तक पहुंचा, 24 घंटे में गाड़ीयां 5km रास्ता तय कर पा रही है…@yadavtejashwi @NitishKumar #Bihar #Rohtas #Video pic.twitter.com/NpNG3CL2co
— Gaurav Kumar (@gaurav1307kumar) October 8, 2025
ఫలితంగా రోహ్తాస్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఔరంగాబాద్ వరకూ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నాలుగు రోజులుగా ట్రక్కు డ్రైవర్లు, సాధారణ ప్రయాణికులు తిండి, నీళ్లు లేక రోడ్లపైనే నరకయాతన అనుభవిస్తున్నారు. కొంత దూరం ప్రయాణానికే గంటల సమయం పడుతోంది. ఆహారం, నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాఫిక్ వల్ల వ్యాపారాలు కూడా దెబ్బతింటాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.
Also Read..
Vijay | విజయ్ రోడ్ షోలో 41 మంది మృతి.. బాధితులని కలిసేందుకు అనుమతి ఇవ్వాలంటూ డీజీపీకి లేఖ
అమెరికా చదువులకు బైబై.. ట్రంప్ ఆంక్షలతో భారతీయ విద్యార్థుల ఆలోచనల్లో మార్పు