Highway Explosions: ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కును ఢీకొన్న ట్యాంకర్.. జైపూర్-అజ్మీర్ హైవేపై భారీ ప్రమాదం
Highway Explosions: జైపూర్-అజ్మీర్ రహదారిపై మంగళవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదం వల్ల పేలుళ్లు జరిగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.
అజ్మీర్: జైపూర్-అజ్మీర్ రహదారిపై మంగళవారం రాత్రి భారీ ప్రమాదం(Highway Explosions) జరిగింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదం వల్ల పేలుళ్లు జరిగాయి. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు పేలుతున్న సమయంలో కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ దృశ్యాలు కనిపించాయి. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు జైపూర్ ఐజీ రాహుల్ ప్రకాశ్ తెలిపారు.
సిలిండర్లతో వెళ్తున్న ట్రక్కుకు చెందిన డ్రైవర్‌ను ప్రాథమిక చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సీఎంహెచ్వో రవి షెకావత్ తెలిపారు. సీఎం భజన్‌లాల్ శర్మ ఆదేశాల ప్రకారం డిప్యూటీ సీఎం ప్రేమ్ చాంద్ బైర్వా ఘటనా స్థలిని సందర్శించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉన్నది. దుడా ఏరియాలో జరిగిన ప్రమాద ప్రదేశానికి పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నది. హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ట్రక్కులో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు మిస్సింగ్‌లో ఉన్నట్లు బైర్వా తెలిపారు. వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.
ఈ ప్రమాదంలో ఎవరైనా మరణించినట్లు ఇంత వరకు అధికారిక సమాచారం లేదు. ఎల్పీజీ సిలిండర్ల వెళ్తున్న ట్రక్కు ఓ హోటల్ బయట పార్కింగ్ చేసి ఉందని, ఆ సమయంలో డ్రైవర్ భోజనం చేస్తున్నాడని, అయితే వెనుక నుంచి వచ్చిన ట్యాంకర్ దాన్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గత ఏడాది డిసెంబర్లో కూడా జైపూర్ హైవేపైనే ఎల్పీజీ ట్యాంకర్‌ను ఓ ట్రక్కు ఢీకొన్నది. ఆ సమయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ ప్రమాదంలో సుమారు 19 మంది మరణించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delimitation Bill | చరిత్రలో మొదటిసారి గరిష్ఠంగా సీట్ల పెంపు
Telangana | ఎట్టకేలకు తెలంగాణకు ఊరట.. విభజన చట్టంలోని ప్రతిపాదనకు మించి పెరుగనున్న నియోజకవర్గాలు
డీలిమిటేషన్ బిల్లుపై ఎన్డీయే మిషన్-360.. లోక్‌సభ సీట్ల పెంపు ఖాయం!
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

