Gold Prices | ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగారం ధరలు (Gold Prices) ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర నేడు మరింత పెరిగింది. ఒక్కరోజే రూ.2,290 పెరిగి ఆల్‌టైమ్ హైకి చేరింది. బుధవారం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర తొలిసారి రూ.1,26,070కి ఎగబాకింది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,16,750కి చేరింది. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీపడి మరీ పెరిగిపోతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1.58 లక్షలుగా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
పసిడి ధరలు పెరగడానికి అనేక కరాణాలు ఉన్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులకు తోడు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్‌డౌన్ (US govt shutdown) కూడా ఓ కారణంగా పేర్కొంటున్నాయి. వడ్డీరేట్లను ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంకా తగ్గిస్తుందన్న అంచనాల మధ్య మదుపరులు తమ పెట్టుబడులను సురక్షిత సాధనమైన పుత్తడి వైపునకు మళ్లిస్తున్నారు. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండడం కూడా బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దీంతో పసిడి ధరలు అంతకంతకూ పెరుగుతూపోతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read..
Tata Group | టాటా గ్రూప్‌లో ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..?
Karur stampede | కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీకే