High Court | కాంగ్రెస్ సర్కార్ గత నెల 28వ తేదీన రాయదుర్గం పరిధిలో ఉన్న నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబర్ 83/1లో ఉన్న భూమిని ఒక్కో ఎకరం రూ.237 కోట్ల చొప్పున ఆక్షన్ (వేలం) ద్వారా విక్రయించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం తమకు చెందిన భూమిని విక్రయించిందని SBI హైకోర్టును ఆశ్రయించడంతో ఎస్బీఐ (SBI) భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది.
రాయదుర్గం ఎస్బీఐ భూముల వ్యవహారం విచారిస్తూ ప్రభుత్వంపై హైకోర్టు న్యాయమూర్తి మండిపడ్డారు. అవి ఎస్బీఐ భూములని తెలియదా..? ప్రభుత్వ సంస్థ భూములు ఎలా విక్రయిస్తారు..? భూములు వేలం వేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలి అనుకున్నారా..? సర్కార్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.
రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి రూ.237 కోట్లు అని ప్రచారం చేసుకున్న భూమి తమదేనని.. ఆ భూమిలో 5 ఎకరాలు తమవేనని, సదరు భూమిపై రిట్ ఆర్డర్ ఇవ్వాలని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో టీజీఐఐసీ భూముల వేలంపై నేడు హైకోర్టు 3 వారాలు స్టే విధించింది. ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ, టీజీఐఐసీ, గౌర వెంచర్స్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అవి ఎస్బీఐ భూములని తెలియదా? ప్రభుత్వ సంస్థ భూములు ఎలా విక్రయిస్తారు?
భూములు వేలం వేస్తూ రియల్ ఎస్టేట్ రంగాన్ని పరుగులు పెట్టించాలి అనుకున్నారా?
రాయదుర్గం ఎస్బీఐ భూముల వ్యవహారం విచారిస్తూ ప్రభుత్వంపై మండిపడ్డ హైకోర్టు న్యాయమూర్తి https://t.co/JUyK1qWegD pic.twitter.com/jdFPF40r0m
— Telugu Scribe (@TeluguScribe) June 18, 2026
Uttar Pradesh | బ్యాంక్ లాకర్లో పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు మాయం.. యూపీలో ఘటన
Batwara 1947 | దేశ విభజన నేపథ్యంలో సన్నీ డియోల్ ‘బట్వారా 1947’.. ఆసక్తికరంగా టీజర్!