Women | ఎల్బీ నగర్లోని హాస్పిటల్లో అర్ధరాత్రి ఓ మహిళ హల్ చల్ చేసింది. లలిత కరీర అనే మహిళ కడుపునొప్పి ఉందంటూ ఎల్బీ నగర్ శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లోని అత్యవసర విభాగంలో చేరింది. ప్రాథమిక చికిత్సనందించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలియజేశారు. దీంతో లలిత కరీర డాక్టర్లపై ఆగ్రహంతో ఊగిపోతూ దూషిస్తూ వారిపై దాడికి పాల్పడింది.
దాడి అనంతరం లలిత కరీర TS 08 HG 9824 నంబర్ కారును స్వయంగా నడుపుకుంటూ వనస్థలిపురంలోని సహారా హాస్పిటల్కు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఎల్బీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంతకీ ఆ మహిళ డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది పట్ల అలా ఎందుకు ప్రవర్తించిదనేది తెలియాల్సి ఉంది.
ఎల్బీ నగర్ – శ్రేష్ఠ ఆరెంజ్ హాస్పిటల్లో అర్ధరాత్రి మహిళ హల్చల్
కడుపునొప్పి ఉందంటూ అత్యవసర విభాగoలో చేరిన లలిత కరీర అనే మహిళ
ప్రాథమిక చికిత్స అందించి పరీక్షలు నిర్వహించి, ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలిపిన డాక్టర్లు.. దీంతో వారిపై ఆగ్రహంతో దూషిస్తూ దాడి
పోలీసులకు ఫిర్యాదు… pic.twitter.com/VRrXHvO6tf
— Telugu Scribe (@TeluguScribe) June 28, 2026
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!