శంషాబాద్ రూరల్, జనవరి 21 : కిరాణాషాపుకు వెళ్లిన మహిళ అదృశ్యమైన(Woman missing) సంఘటన సోమవారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేందర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దతూప్ర గ్రామానికి చెందిన తెలగమల్ల అఖిల(36) ఇంటివద్దనే ఉంటుంది.ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంట్లో నుంచి కిరాణాషాపుకు వెళ్తున్నట్లు చెప్పి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గతంలో సైతం ఐదుసార్లు ఇలాగే చెప్పకుండా ఇంట్లో నుంచి భయటికి వెళ్లిన ఆమె పలుమార్లు తల్లిదండ్రులతో తనవద్దకు వస్తే పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకొని ఇంట్లోకి రానిచ్చిన్నట్లు తెలిపారు. ఆదివారం వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసిన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
ఇవి కూడా చదవండి..
Telangana | సీఎం విదేశీ టూర్లు, పక్క రాష్ట్రాల్లో మంత్రులు.. కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్రం