హైదరాబాద్ : రాష్ట్రం పరిస్థితి కుక్కల చింపిన విస్తరిలా తయారైంది. కాంగ్రెస్ పార్టీ(Congress) గెలిచి సంవత్సర కాలమైనా పాలనపై పట్టులేక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఇచ్చిన హామీలు అమలు కాక, ఉన్న వాటిలో కోతలు విధిస్తున్నారు. మోసపోయామని గుర్తించి ఉద్యమిస్తున్న ప్రజలపై లాఠీలు, ఇనుప బూట్లతో విరుచుకుపడుతూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారు. కాగా, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఆరు గ్యారంటీల(Six guarantees) అమలు కోసం గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావించింది.
ఇందుకు ఈ నెల 24 వరకు గ్రామ సభలు, వార్డు సభలు(Gramasbhalu) నిర్వహిస్తుననారు. ఇలాంటి కీలక సమయంలో ఏ ఒక్క మంత్రి కూడా అందుబాటులో ఉండకుండా పోవడం హాట్ టాఫిక్‌గా మారింది. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పర్యటనలో విహరిస్తుండగా మిగతా మంత్రులు కర్ణాటక టూర్‌కు వెళ్లిపోయారు. బెళగావిలో ‘సంవిధాన్ బచావో’ ర్యాలీలో పాల్గొనేందుకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో 9 మంది మంత్రులు బయలుదేరారు.
అయితే గ్రామసభల్లో ప్రజలు తిరగబడతారని ముందే ఊహించి ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్రం విడిచి వెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్లగానే గ్రామసభల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలు తిరుగబడుతున్నారు. రెండు లక్షల రుణ మాఫీ కాలేదు.. తులం బంగారం ఇవ్వలేదు.. రైతు భరోసాకు ఇంతవరకు జాడ లేదు అంటూ ఎక్కడికక్కడ అధికారులను నిలదీస్తున్నారు. సీఎంతో సహా ఒక్క మంత్రి కూడా అందుబాటులో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత ఘోరమైన పాలనను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడూ చూడలేదని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు చర్చించుకుంటున్నారు.