Jagadish Reddy | కేటీఆర్ ఫొటో చూస్తేనే.. మంత్రి వెంకటరెడ్డికి వెన్నులో వణుకుపుడుతున్నది : జగదీష్ రెడ్డి
Jagadish Reddy | గులాబీ రంగు చూసినా.. కేటీఆర్ ఫొటో కనబడినా మంత్రి కేటీఆర్‌కు వెన్నులో వణుకుపుడుతున్నదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు.
సూర్యాపేట : నల్లగొండ జిల్లాలో పోలీస్, కాంగ్రెస్ గుండాల రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సహా పార్టీ శ్రేణుల అరెస్ట్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మంత్రి వెంకట్ రెడ్డికి కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. కేటీఆర్ ఫొటో(KTR) చూసినా గులాబీ రంగు చూసినా వెంకట్ రెడ్డికి బయమవుతున్నదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ఫ్లెక్సీలను వదిలి కావాలనే మున్సిపాలిటీ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలు చించేశారు.
మంత్రి వెంకట్ రెడ్డి సోయిలో లేకుండా ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు.
వెంకట్ రెడ్డి మాటలు విని డ్యూటీ చేస్తే అధికారులు ఇబ్బందులు పడుతారన్నారు. పోలీస్ రాజ్యం అమలు చేస్తే చూస్తూ ఊరుకోం. పాలన ఇలానే కొనసాగితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. మంత్రి స్వయంగా ఫోన్ చేసి మాపై కార్యకర్తలను ఉసిగొల్పుతున్నాడు. మున్సిపాలిటీ లో కాంగ్రెస్ నాయకులకు ఏం పని అని ప్రశ్నించారు. చిల్లర దాడులు మమ్మల్ని ఆపలేవన్నారు.
కాంగ్రెస్ పాపాల పుట్ట పలుగుతుంది. కాంగ్రెస్ రహిత తెలంగాణా కోసం నల్లగొండ నుంచే ఉద్యమం మొదలవుతుందన్నారు. కాంగ్రెస్ హఠావో తెలంగాణా బచావో నినాదం మొదలైంది. గుర్తుపెట్టుకోండి ..ఇప్పటికైనా మారకపోతే కాంగ్రెస్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. గ్రామ సభల్లో కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడుతుంది. రెండు సార్లు ప్రజల దరఖాస్తులు తీసుకుని బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ మోసాల పై ప్రజల తిరుగుబడటం ఖాయమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
KTR | రైతుల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది.. గజ్వేల్ ఎమ్మార్వోపై కేటీఆర్ ఆగ్రహం
గరీబ్‌పేట గ్రామంలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

