KTR | కాంగ్రెస్ సర్కార్ పాలనలో మొత్తం రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ.. మొదట ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెడ్తరట. ఆ తర్వాత బావుల కాడ మోటార్ల దగ్గర కూడా మీటర్లు పెడతరట. అందుకే కేసీఆర్ మీకు ముందే చెప్పిండు.. ఆనాడు మోదీ నా మీద ఎంత ఒత్తిడి తెచ్చినా.. మోదీ మెడ మీద కత్తి పెట్టినా కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
అంబర్పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మోటార్లకు మీటర్ పెట్టుమంటే నా బొండిగె మీద కత్తి పెట్టినా.. నా మెడ కోసినా నేను మాత్రం పెట్టా అని చెప్పి కేసీఆర్ పెట్టలేదు. కానీ రేవంత్ రెడ్డి మీద కేసులున్నయి కదా.. పాపం ఆయనకు భయమెక్కువ. అందుకే మోదీ తానా అనగానే తందానా అన్నడు. నిన్న కేబినెట్లో నిర్ణయం తీసుకున్నడు.. మోటార్లకు మీటర్లు పెడ్తడట. మరి ఈ రాష్ట్రంలో రైతులుఆలోచన చేసుకోవాలె అన్నారు కేటీఆర్ .
ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు పీకి వీళ్లను బంగాళాఖాతంలో వేద్దామా..? లేదా ఇట్లనే చూసుకుంట కూర్చుందామా..? ఆలోచన చేయాలని నేను కోరుతున్న. మరి ప్రీ పెయిడ్ మీటర్లు పెడితే హైదరాబాద్లో మీ ఇండ్లళ్లకు కూడా వస్తయి. ఆదానీలు, అంబానీలు వాళ్లయే ఉన్నయి దుకాణాలు మొత్తం. వాళ్లు ఇంటింటికి వచ్చి మీటర్లు పెడ్తరు. ఫ్రీ కరెంట్ అంటరు. ఇంకోదిక్కు ఉచిత కరెంట్ ఉత్తకరెంట్ అయితది. మొత్తం బతుకు మళ్లీ ఆగమైతది. కేసీఆర్ అందుకే ముందే చెప్పిండు.. ఓటేసే ముందే ఆలోచించాలే. ఆగం కావొద్దన్నారని చెప్పుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు.
ట్రాన్స్ఫార్మర్లకు, మోటార్లకు మీటర్లు పెడతారు అంట
ఆనాడు మోడీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదు
కానీ రేవంత్ రెడ్డి కేసుల భయంతో మోదీ తానా అంటే తందాన అంటున్నాడు
ఇంక ఈ కాంగ్రెస్ ఫ్యూజులు పీకాల్సిందే
– కేటీఆర్ pic.twitter.com/QU4A1y7a24
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026
ఉచిత విద్యుత్తు రద్దు కోసమే కాంగ్రెస్ మోటార్లకు మీటర్లను పెడుతుంది.
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయబోతున్నది.
కాంగ్రెస్ వస్తే ఉచిత విద్యుత్తు పోతుందని ఆనాడే హెచ్చరించాము.
ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు… pic.twitter.com/H0Cxdxo7Pa
— BRS Party (@BRSparty) May 24, 2026