Harish Rao | కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అన్నాడు.. కానీ మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యరా..? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు.
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. గతంలో కేసీఆర్ ఒకేసారి 17 వేల ఖాళీలుంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతా అంటున్నవ్.. చిక్కడ పల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్ సుఖ్ నగర్లో పిల్లలు రోడ్లపైకి వచ్చి 19 వేల నోటిఫికేషన్లు వేయాలని ధర్నా చేస్తే.. ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టనట్టు కూడా లేదు. ఎన్నికల ముందు పరీక్షల ఫీజు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు రూ.400 ఫీజు ఉంటే వాటిని రూ.800 చేశాడు. ఎన్నికల ముందైతే ఫ్రీ ఎన్నికల తర్వాతైతే డబుల్ అన్నట్టు అని మండిపడ్డారు హరీశ్ రావు .
కొత్త డీజీపీ సీవీ ఆనంద్ పోలీస్ శాఖలో 19 వేల ఖాళీలు ఉన్నాయని అన్నాడు
రేవంత్ రెడ్డి ఏమో కేవలం 5 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని అంటున్నాడు
గతంలో కేసీఆర్ 17 వేల ఖాళీలు ఉంటే 17 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చాడు.. మరి రేవంత్ రెడ్డి ఎందుకు 5 వేల ఉద్యోగాలే నింపుతున్నాడు?… https://t.co/B9gZRieYPR pic.twitter.com/bf9faGnCMC
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026