Illegal Activities |ఇటీవల మల్కాజిగిరి సీపీగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే ఐపీఎస్ అధికారి సుమతి అర్థరాత్రి కీలక ఆపరేషన్ చేపట్టిన విషయం తెలిసిందే. సీపీగా కాకుండా సాధారణ మహిళగా బస్టాండ్లో నిల్చున్న సుమతిని 40 మంది పోకిరీలు చుట్టుముట్టారు. వారంతా రకరకాల ప్రశ్నలతో సీపీ సుమతిని వేధించారు. అర్థరాత్రి అమ్మాయిలు, మహిళలను వేధిస్తున్న వారందరినీ సుమతి వెంట వచ్చిన పోలీసులు వ్యానుల్లో ఎక్కించి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. గత మే నెలలో ఈ ఘటన జరుగగా.. ఆకతాయిలకు ఇవేం పట్టడం లేదు.
హైదరాబాద్లో అర్ధరాత్రి ఏకంగా మహిళా ఐపీఎస్ అధికారి రంగంలోకి దిగి నిఘా ఆపరేషన్ చేసినా తీరు మారడం లేదు. తాజాగా కేపీహెచ్బీలో అర్ధరాత్రి యథేచ్ఛగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కేపీహెచ్బీ కాలనీ మెట్రో స్టేషన్ పరిసరాల్లో మాస్క్ వేసుకున్న అమ్మాయిలు, మహిళలు, బైకులు, కార్లలో వచ్చిన యువకులతో అర్థరాత్రి రద్దీగా ఉన్న దృశ్యాలు పరిస్థితిని మరోసారి కండ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి.
హైదరాబాద్లో అర్ధరాత్రి మహిళా ఐపీఎస్ అధికారి నిఘా ఆపరేషన్ చేసినా మారని తీరు
కేపీహెచ్బీలో అర్ధరాత్రి యథేచ్ఛగా కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు https://t.co/GDcGBsTLDu pic.twitter.com/JuhqRs6bjI
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2026