హైదరాబాద్ : రాష్ట్రంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగాయి. ఆడ పిల్లల్ని కనాలంటే భయపడే పరిస్థితి రాష్ట్రంలో ఉందని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితామహేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ..మోదీ భేటీ బచావో భేటీ పడావో అంటారు. కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి తెలంగాణలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.ఫోక్సో కేసులు దేశంలో 6 శాతం నమోదు అయితే ఒక్క తెలంగాణలో 16శాతం ఫోక్సో కేసులు నమోదు అయ్యాయని విమర్శించారు. తెలంగాణలో క్రైమ్ రేట్ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఇప్పటి వరకు సమీక్ష చేయలదని మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ సర్పంచ్ చిన్నారిపై దాడి చేస్తే పోలీసు వాళ్లు సెటిల్ మెంట్ చేశారు. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం అంటున్నారు. ముందు తెలంగాణలో చిన్నారులను కాపాడండి.
తెలంగాణలో మహిళలపై జరుగుతున్న దాడులు సోనియాగాంధీ, ప్రియాంక గాంధీకి తెలియవా అని ప్రశ్నించారు. బండి భగీరధ్ కేసు విషయంలో తొలుత వీక్ సెక్షన్లు పెట్టారు. రాష్ట్రంలో మహిళలు రోడ్డు ఎక్కితే అప్పుడు సెక్షన్లు మార్చారని గుర్తు చేశారు. చిన్నారులపై అఘాయిత్యాలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహిళలకు ధైర్యం ఉండేదన్నారు.