Talasani Srinivas Yadav | అభయహస్తం కింద ఏవైతే డిక్లరేషన్ చేసిర్రో.. దాంట్లో ప్రధానమైంది ‘యూత్ డిక్లరేషన్’. యూత్ అంటే మన రాష్ట్ర, దేశ భవిష్యత్. యూత్ డిక్లరేషన్ పేరిట నిరుద్యోగులకు ఎన్నో అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ సర్కార్ గద్దెనెక్కిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. యూత్ డిక్లరేషన్ పేరుతో అమరవీరుల త్యాగాలకు గుర్తింపుగా ప్రభుత్వ ఉద్యోగమని.. వారికి నెలనెలా పెన్షన్ అని ఒక కార్యక్రమం చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలిస్తమన్నరు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జాబ్ క్యాలెండర్ ఇస్తరని చెప్పి రెండున్నర సంవత్సరాల నుంచి యువత అంతా ఎదురుచూస్తున్నారు. కానీ గద్దెనెక్కిన నాటి నుండి విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడుతూ…కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల నోట్లో మట్టికొడుతుందన్నారు.
అందుకే ఈ కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ మోసాన్ని ఎండగట్టేందుకు నిరుద్యోగ విద్యార్థులతో కలిసి త్వరలో ‘చలో సరూర్‌నగర్’ పేరిట భారీ సభ నిర్వహిస్తున్నామని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
“యూత్ డిక్లరేషన్” పేరిట నిరుద్యోగులకు
ఎన్నో అలవికాని హామీలిచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది.కానీ, గద్దెనెక్కిన నాటి నుండి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు మంగళం పాడుతూ…
కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా
నిరుద్యోగుల నోట్లో మట్టికొడుతోంది!అందుకే ఈ కాంగ్రెస్ యూత్… pic.twitter.com/DwoeuTojmr
— BRS Party (@BRSparty) May 25, 2026