KTR | నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు టికెట్లు ఇస్తామపి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
అంబర్పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో తలసాని మాట్లాడుతూ.. వేదిక మీద కూర్చున్న.. వేదిక ముందు కూర్చున్న నాయకులకు విజ్ఞప్తి చేస్తున్న. మనం ఎవరికీ కూడా పలానా వారికి టిక్కెట్లు ఇస్తామని వాగ్ధానాలు చేయలేం. ఎవరు ఎక్కువ ఉరుకుతరో.. ఎవరెక్కుత తండ్లాడుతరో.. ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తరో.. ఎవరో కార్యక్షేత్రంలో గట్టిగా మెంబర్ షిప్ చేస్తరో.. ఎవరైతే గట్టిగా ప్రజల కోసం నిలబడ్తరో.. పార్టీ కోసం నిలబడ్తరో.. కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ పెద్ద నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
కాలేరు వెంకటేశ్ గారిని మీరేం అనొద్దు.. ఆయనకు మీరంతా కావాల్సిన వాళ్లే..పలానా వాళ్లు దగ్గర.. పలానా వాళ్లు దూరమని ఆయనకేం ఉండది. నాకు రేపు ఎవరు గెలుస్తరు.. పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవరికి పరపతి ఉన్నది. ప్రజలకు ఎవరి మంచి పేరున్నది. ఇవన్నీ చూసుకొని వారికే టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాదు.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు టికెట్లు ఇస్తాము
– కేటీఆర్ pic.twitter.com/WSxs93tkQ7
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2026