Water Supply | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 11న నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొన్నారు. హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఫోర్‌బే, మీరాలం ఫిల్టర్ బెడ్స్, పలు ట్యాంక్‌లు, ఇన్లెట్ ఛానెల్స్‌ను శుభ్రపరచనున్న నేపథ్యంలో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. జనవరి 11న ఉదయం 6 గంటల నుంచి 12 ఉదయం 6 గంటల వరకు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు.
హసన్‌నగర్, కిషన్ బాగ్, దూద్‌బౌలి, మిస్రిగంజ్, పత్తర్ఘటి, దారుల్షిఫా, మొఘల్‌పురా, జహనుమా, చందులాల్ బరదరి, ఫలక్‌నుమా, జంగంమెట్ ఏరియాల్లో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఈ ప్రాంతాల ప్రజలు నీటిని తక్కువగా వినియోగించాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ
Rtc bus | సికింద్రాబాద్ నుంచి చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు 10 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు
Kukatpally Metro | కూకట్పల్లి మెట్రో స్టేషన్ పేరు మార్పు : మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి
Hansika Motwani | హన్సికా మోత్వానీపై గృహ హింస కేసు.. ఇంతకీ ఎవరు పెట్టారంటే..?