Hansika Motwani | గ్లామరస్ పాత్రలతోపాటు నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది హన్సికా మోత్వానీ. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ భామ తాజాగా గృహ హింస (domestic violence) కేసుతో వార్తల్లో నిలిచింది.
ప్రశాంత్ మోత్వానీ (హన్సికా మోత్వానీ సోదరుడు) భార్య ముస్కాన్ నాన్సీ హన్సిక కుటుంబంపై గృహ హింస, క్రూరత్వం, ఆర్థిక దోపిడీతోపాటు వివిధ నేరాల కింద కేసు నమోదు చేసింది. 2024న డిసెంబర్ 18న ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది.
హన్సికా, ఆమె తల్లి మోనా మోత్వానీ తన భర్తతో వివాహం, రిలేషన్షిప్ విషయంలో జోక్యం చేసుకొని మనస్పర్థలు వచ్చేలా చేశారని ముస్కాన్ ఆరోపించింది. తన భర్త గృహ హింసకు కూడా పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తాను బెల్ ఫాల్సీ అనే నాడీ సంబంధిత రుగ్మత (పక్షవాతం) బారిన పడ్డానని చెప్పింది ముస్కాన్ . హన్సిక, అత్త ఆస్తి లావాదేవీలకు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలిపింది. మరి ఈ గృహ హింస కేసు వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Ramya | ఆ సన్నివేశాలు తొలగించండి.. కోర్టును ఆశ్రయించిన నటి రమ్య