కేపీహెచ్బీ కాలనీ, జనవరి 8 : కూకట్పల్లి మెట్రో స్టేషన్కు(Kukatpally Metro) ఓమ్ని వైద్యశాల కూకట్పల్లి మెట్రో స్టేషన్గా(Omni Hospital) నామకరణం చేసినట్లు మెట్రోరైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు. కూకట్పల్లి మెట్రోస్టేషన్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్రోరైల్ మేజేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి, ఇన్కార్న్ సంస్థ, ఓమ్ని వైద్యశాల చైర్మన్ ఆర్బిఎస్ సూర్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.
ఈ వేదికపై మెట్రోరైల్లో ప్రయాణికుల కోసం రూ.399తో ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, సీబీపీ, ఆర్బీఎస్, డాక్టర్ కన్సల్టేషన్తో కూడిన హెల్త్ ప్యాకేజీని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మెట్రోరైల్ ప్రయాణికులతో పాటు మెట్రోలో పనిచేసే కార్మికుల కోసం ఓమ్ని వైద్యశాలలో ప్రత్యేక రాయితీని కల్పిస్తామన్నారు. మెట్రో ప్రయాణికులకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
మెట్రోరైల్ సేవలలో ఓమ్ని కూడా భాగమైందుకు సంతోషంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో మెట్రోరైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధీర్, చీఫ్ స్టాటజీ ఆఫీసర్ మురళి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, ఓమ్ని గ్రూప్ డైరెక్టర్ పూర్ణిమారెడ్డి, సీఈవో దుర్గేష్, చీఫ్ ఫైనాన్సియన్ ఆఫీసర్ అంకిత్షా, యూనిట్ హెడ్ సూపరిండెంట్ వారీస్, జీఎం శ్రీనివాస్, వైద్యశాల పీఆర్వో ఎండీ ఆసీఫ్, సిబ్బంది ఉన్నారు.