RS Praveen kumar| నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుందని బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. నేను తల్లిగా సాక్షాత్తు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ చిన్నపిల్ల కొట్లాడలేదు కదా..? బాధితురాలి తల్లి నాతో చెప్పింది. నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేసిందన్నారు.
మీరు మాజీ పోలీసాఫీసర్ కాబట్టి మీకు తెలిసిన పోలీస్ అధికారి ఎవరైనా ఉంటే వాళ్లను రిక్వెస్ట్ చేసి ఈ దుష్రచారాన్ని ఆపించండి సార్. నా బిడ్డ చేయరాని పని చేస్తే తల్లిగా నేను తట్టుకోలేనని ఆమె అంటోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. దయచేసి రేవంత్ రెడ్డి మీరు కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలని సూచించారు. ప్రధాని బందోబస్తు కారణంగా కేసులో ఆలస్యం అయిందని స్వయంగా డీజీపీ చెప్తుంటే బండి సాయి భగీరథ్ పారిపోయాడేమో అని భయంగా ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఇప్పుడు డీజీపీగా ఉన్న సీవీ ఆనంద్, గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు అమ్నీషియా పబ్బులో ఒక విదేశీ యువతి మీద అఘాయిత్యం జరిగింది. ఆ అఘాయిత్యం జరిగినప్పుడు ప్రతి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ పురోగతి తెలియజేశారు. ఇప్పుడు అదే డీజీపీ సీవీ ఆనంద్ బండి భగీరథ్ పోక్సో కేసు మీద ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఆ బాధితురాలి తల్లి ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అంటుందని.. ముఖ్యమంత్రి ఏమో నిందితుడి తండ్రిని పక్కన పెట్టుకొని ఇతడు నా ప్రియమిత్రుడు అంటున్నాడని అన్నారు.
“నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి” అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా?
నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది
రేవంత్ రెడ్డి కూడా ఒక… https://t.co/pRAQkDRwQg pic.twitter.com/ADRR07YpnT
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026
ఇప్పుడు డీజీపీగా ఉన్న సీవీ ఆనంద్, గతంలో హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు అమ్నీషియా పబ్బులో ఒక విదేశీ యువతి మీద అఘాయిత్యం జరిగింది
ఆ అఘాయిత్యం జరిగినప్పుడు ప్రతి రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఇన్వెస్టిగేషన్ పురోగతి తెలిపాడు
ఇప్పుడు అదే డీజీపీ సీవీ ఆనంద్ బండి భగీరథ్… https://t.co/A8bi14bS9t pic.twitter.com/M6cHuEV5T0
— Telugu Scribe (@TeluguScribe) May 14, 2026
Rashmika | ‘మైసా’ కోసం రష్మిక కష్టాలు .. కాళ్లకు టేప్ వేసుకొని మరి..!
CM Vijay | త్వరలో మహిళలకు నెలకు రూ.1,000.. వెల్లడించిన తమిళనాడు సీఎం విజయ్