నిర్మల్ : జిల్లాలోని ఖానాపూర్( Khanapur ) పట్టణం శాంతినగర్‌కు చెందిన బొమేన మౌనిక( Bomena Mounika ) అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఈ నెల 9వ తేదీన మామడ మండలం కోరిటికల్ పంచాయతీ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో అత్తవారి ఇంటి నుంచి అదృశ్యమైన మౌనిక మృతదేహం గురువారం ఖానాపూర్ మండలం తర్లపాడు శివారులోని అటవీ ప్రాంతంలో లభ్యమైంది.
స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. యువతి ఆత్మహత్య చేసుకుందా ? హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.