Rashmika |స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా ఆమె నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘మైసా’పై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కేరళ షెడ్యూల్ పూర్తి చేసిన రష్మిక.. అక్కడి అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడంతో అవి వైరల్‌గా మారాయి. కొచ్చిలో జరిగిన షూటింగ్ గురించి రష్మిక చేసిన పోస్టులు ఇప్పుడు నెటింట చర్చనీయాంశంగా మారాయి. ప్రకృతి అందాలు, అడవులు, జలపాతాలు, ఎత్తైన కొండలు, వర్షాల మధ్య సాగిన షూటింగ్ తనకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభవమని ఆమె వెల్లడించారు.
ప్రత్యేకంగా ఎత్తైన ప్రదేశాలంటే తనకు భయం ఉన్నప్పటికీ.. ‘మైసా’ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం ఆ భయాన్ని ఎదుర్కొంటూ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నానని రష్మిక తెలిపారు. షూటింగ్ సమయంలో అడవుల్లో ట్రెక్కింగ్, ఔట్‌డోర్ యాక్షన్ ఎపిసోడ్స్, భారీ వర్షాల మధ్య చిత్రీకరణ చాలా కష్టంగా సాగిందని చెప్పారు. ఈ షెడ్యూల్లో యాక్షన్ సీన్ల కోసం శారీరకంగా చాలానే శ్రమపడాల్సి వచ్చిందని రష్మిక వెల్లడించారు. మోకాళ్లు, కాళ్లకు టేపింగ్ వేసుకుని కూడా యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నానని తెలిపారు. తనతో పనిచేస్తున్న యూనిట్ సభ్యులు కూడా జాగ్రత్తగా ఉండాలని తరచూ చెప్పేదాన్నని గుర్తు చేసుకున్నారు.
అయితే ఈ కష్టాల మధ్య కేరళలో ఫేమస్ అయిన ‘పాళమ్ పూరీ’ని మాత్రం బాగా ఎంజాయ్ చేశానంటూ సరదాగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే బాల్కనీలో నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్న కొన్ని ఫొటోలను కూడా రష్మిక ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోల్లో ఆమె చాలా నేచురల్‌గా కనిపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ‘మైసా’ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రష్మిక ఇప్పటికే థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ప్రత్యేక యాక్షన్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు తెలిసింది. తాజాగా కేరళలో జరిగిన షెడ్యూల్లో కీలకమైన స్టంట్స్‌ను చిత్రీకరించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ పూర్తైన సందర్భంగా యూనిట్ సభ్యులతో కలిసి తీసుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మిక.. “ఇంత కష్టపడి పనిచేసిన నా టీమ్‌కు థ్యాంక్యూ.. త్వరలో మళ్లీ సెట్స్‌లో కలుద్దాం” అంటూ ఎమోషనల్‌గా స్పందించారు.