Congress Leaders | కాంగ్రెస్ పార్టీ అంటే చాలు.. గల్లీ లీడరా.. ఢిల్లీ లీడరా అనేది సంబంధం లేదు.. కుర్చీల కోసం, సీటు కోసం తమ స్థాయిని మరిచిపోయి మరీ కొట్లాడుతుంటారని తెలిసిందే. అలాంటి ఘటనే తాజాగా గాంధీభవన్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షను నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశంలో రసాభాస నెలకొంది.
గాంధీభవన్‌లో మంత్రి అజారుద్దీన్ పక్కన కూర్చునే విషయంలో మైనార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ హజ్రీ మధ్య గొడవ జరిగింది. ఇద్దరు చొక్కాలు పట్టుకున్నారు. ఉస్మాన్ హజ్రీ ఫిరోజ్‌ఖాన్ చొక్కాపట్టుకుని చెంపపై కొట్టాడు. ఈ క్రమంలో ఫిరోజ్ ఖాన్ కింద పడ్డాడు. వారిని వారించేందుకు మధ్యలోకి వచ్చిన వీహెచ్ హన్మంతరావును కూడా తోసేసే ప్రయత్నం చేయడంతో పక్కనే ఉన్న నేతలు వారిని అడ్డుకున్నారు.
పహిల్వాన్లా రెచ్చిపోతున్నావంటూ వీహెచ్ ఫైర్ అవడంతో అవును పహిల్వాన్నేనంటూ ఉస్మాన్ చెలరేగిపోయాడు. ఈ ఘర్షణతో మంత్రులు అర్థాంతంరంగా సమావేశాన్ని ముగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ సమక్షంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం.
కాంగ్రెస్ హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షా సమావేశంలో రసాభాస
మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముందే చొక్కాలు పట్టుకొని కొట్టుకున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్
ప్రోటోకాల్ విషయంలో గొడవ
అడ్డుకునేందుకు ప్రయత్నించిన హనుమంత రావును కూడా తోసేసేందుకు ప్రయత్నం, అడ్డుకున్న కార్యకర్తలు https://t.co/xx5eCwGlmf pic.twitter.com/gc7h4ulfU3
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026