Unemployees | పోలీస్ నియామకాల కోసం తీసుకొచ్చిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరోసారి ఆందోళన బాట పట్టారు. జీవో 46ను రద్దు చేయాలని, నోటిఫికేషన్లు ఇవ్వాలని దిల్సుఖ్నగర్లో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు.
నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం తప్పా చెప్పండి.. నోటిఫికేషన్ కోసం మాకు ధర్నా చేసే స్వేచ్చ కూడా లేదా..? ఇంత ఘోరమా.. చాతనైతే నోటిఫికేషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డి నీకు సవాల్ విసురుతున్నాం.. నువ్వు నోటిఫికేషన్ విడుదల చేయ్ అని డిమాండ్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. పరిపాలన చాతకాకపోతే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఒక్క పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని..
పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు అసెంబ్లీ సమావేశాలలో నోటిఫికేషన్ గురించి మాట్లాడకుండా 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని మోసపూరిత ఈ మాటలతో రగిలిపోయిన విద్యార్థులు దిల్ సుఖ్ నగర్లో భారీ ర్యాలీ చేపట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 24 నెలలవుతున్నా ఒక్క పోలీస్ ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. నోటిఫికేషన్లో వయోపరిమితిని 35 ఏండ్లకు పెంచాలని కోరారు. అలాగే జీవో నంబర్ 46ను పూర్తిగా రద్దుచేసి, లాంగ్ జంప్ 3.8 మీటర్లకు తగ్గించాలని కోరారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తే నిరుద్యోగుల ఆక్రోశానికి బలి అవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. వారిని అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. ఆనాడు ఎలక్షన్ల కోసం ఇదే నిరుద్యోగులను వాడుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ఈ రోజు ఇదే నిరుద్యోగులను పోలీస్ స్టేషన్లో పెట్టడం అన్యాయమని నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు ఆకాశ్, శంకర్ , వంశీ ,నవీన్ పట్నాయక్. శింబునాయక్ ,ప్రభుత్వాన్ని హెచ్చరించారు
జీవో 46ను రద్దు చేయాలని దిల్సుఖ్నగర్లో నిరుద్యోగుల ఆందోళన
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. పరిపాలన చాతకాకపోతే రాజీనామా చేయాలని ఆందోళన
నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్న పోలీసులు pic.twitter.com/8fnHokYf2x
— Telugu Scribe (@TeluguScribe) March 25, 2026
Talasani Srinivas Yadav | నగరంలో ఒక్క ఇంటినైనా నిర్మించారా ? అసెంబ్లీలో కాంగ్రెస్ను నిలదీసిన తలసాని
Fuel Shortage | తెలంగాణలో ఇంధన కొరత అవాస్తవం : పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్
Oka Roju | జపాన్ మంచులో సాయిపల్లవి ప్రేమకథ.. తెలుగులో ‘ఒక రోజు’గా ఏక్ దిన్!