హైదరాబాద్ : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ శివచంద్ర వివరాలను వెల్లడించారు. ధూల్‌పేటలోని మంగళ్‌హాట్‌కు చెందిన వివేక్ సింగ్ (20) స్థానికంగా కేబుల్ నెట్ వర్క్‌లో పనిచేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివాసముంటున్న బైక్ మెకానిక్ రాహుల్ సింగ్ (21)స్నేహితులు. జల్సాలకు అలవాటు పడిన వీరిద్దరూ డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు.
ఈ క్రమంలో మంగళ్‌హాట్‌కు చెందిన శుభమ్ సింగ్ అనే వ్యక్తినుంచి గంజాయి కొనుగోలు చేసిన వివేక్‌సింగ్, రాహుల్ సింగ్‌లు కలిసి బంజారాహిల్స్ ప్రాంతంలో విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు రోడ్ నెం 1లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద నిలబడి గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకుని వారివద్దనుంచి 2కేజీల గంజాయిని, హోండా యాక్టివా బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి..
‘రైతు బీమా’ దరఖాస్తునకు చివరి తేదీ ఆగస్టు 11
Tokyo Olympics: మెడల్‌పై ఆశలు రేపుతున్న గోల్ఫర్ అదితి
Nanajipur waterfalls : హైదరాబాద్‌కు చేరువలో అద్భుతమైన జలపాతం
Lionel Messi: సంచలనం.. బార్సిలోనా నుంచి మెస్సీ ఔట్