Road Accident | హైదరాబాద్ : నగరంలోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకొచ్చిన గో టూర్ ట్రావెల్స్ బస్సు.. కారును ఢీకొట్టింది. బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో నుంచి బటయకు దూకి డ్రైవర్ ప్రాణాలు దక్కించుకున్నాడు. బాధిత కారు డ్రైవర్ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Road Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసులు మృతి
Shalimar Express | పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Suryakumar Yadav: సౌతాఫ్రికా బ్యాటర్‌తో సూర్యకుమార్ వాగ్వాదం..