కోల్‌కతా: సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్‌ప్రెస్ (Shalimar Express) రైలుకు ప్రమాదం తప్పింది. ఈ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని సౌత్-ఈస్ట్రన్ రైల్వే సీపీఆర్వో వెల్లడించారు. పట్టాలు తప్పిన వాటిల్లో రెండు ప్రయాణికుల బోగీలు కాగా, ఒక పార్సిల్ వ్యాన్ అని అధికారులు తెలిపారు.
శనివారం ఉదయం 5.31 గంటలకు నల్పూర్ సమీపంలో సికింద్రాబాద్-శాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిందని, ఎవరికీ గాయాలు కాలేదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే తెలిపింది. రైలు సికింద్రాబాద్ నుంచి శాలిమార్ వెళ్తున్నదని, ట్రాక్ మారుతుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులకు వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నామని చెప్పింది.
#UPDATE | Howrah, West Bengal: A total of 3 coaches of the 22850 Secundrabad Shalimar SF Express have derailed, including one parcel van and 2 coaches- CPRO South-Eastern Railway https://t.co/ZyjsR3dWBb
— ANI (@ANI) November 9, 2024