Road Accident | బెంగళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుల్బర్గా జిల్లా కమలాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన బొలేరో వాహనం కారును ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను హైదరాబాద్ యూసుఫ్‌గూడ వాసులుగా గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Shalimar Express | పట్టాలు తప్పిన సికింద్రాబాద్-శాలిమార్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Yoga | శ్వాస చిట్కాలతో మరణించినట్లు నటించి.. హత్య నుంచి తప్పించుకున్న యోగా టీచర్
GHMC | అక్కరకు రాని టాయిలెట్లకు లెక్కలేని బిల్లులు!