న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav).. సౌతాఫ్రికా బ్యాటర్ మార్కో జాన్సెన్‌తో వాగ్వాదానికి దిగాడు. సౌతాఫ్రికా ఛేజింగ్ చేస్తున్న సమయంలో.. వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై జాన్సెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఓ ఫీల్డర్ డీప్ నుంచి త్రో చేయగా, దాన్ని కీపర్ శాంసన్ పిచ్‌పై కలెక్ట్ చేసుకున్నాడు.
పిచ్ మీదకు వెళ్లి బంతిని అందుకోవడాన్ని జాన్సెన్ తప్పుపట్టాడు. శాంసన్‌తో అతను వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ జోక్యం చేసుకున్నాడు. సౌతాఫ్రికా బ్యాటర్ జాన్సెన్‌తో సూర్య ఆవేశంగా మాట్లాడాడు. సూర్య తీవ్రంగా వాగ్వాదానికి దిగడంతో.. ఆ ఇద్దరి వద్దకు వచ్చిన అంపైర్ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. తిరిగి వెళ్తున్న సమయంలో.. కొయిజితో కూడా సూర్య మాట్లాడాడు. ఆ ఓవర్ చివరి బంతికి జాన్సెన్ను ఔట్ చేశాడు బిష్ణోయ్. ఈ మ్యాచ్‌లో శాంసన్ 50 బంతుల్లో 107 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
— Drizzyat12Kennyat8 (@45kennyat7PM) November 8, 2024