హైదరాబాద్ : ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న బస్సులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సులపై దృష్టి సారించారు.
కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కన్యాకుమారి, కర్ణాటక, బెంగుళూరు, ఆంద్రప్రదేశ్, గోవాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు తనిఖీలు చేస్తున్నారు. తెలంగాణ ట్యాక్స్ కట్టని బస్సులపై కొరడా ఝులిపిస్తున్నారు. లగేజీ తరలించే వాహనాలపై సీరియస్గా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 16 బస్సులపై కేసులు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి..