Murali Mohan | హైదరాబాద్ : టీడీపీ మాజీ ఎంపీ, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మురళీ మోహన్ హైడ్రా నోటీసులపై స్పందించారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు రంగలాల్ కుంట చెరువును పరిశీలించారు. బఫర్ జోన్లో మూడు అడుగుల మేరకు రేకుల షెడ్డు ఉన్నట్టు గుర్తించారు.. ఆ షెడ్ మేమే తొలగించేస్తాం. నేను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నాను.. ఏనాడూ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు. మంగళవారంలోపు తాత్కాలిక షెడ్ తొలగిస్తామని మురళీ మోహన్ స్పష్టం చేశారు.
గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని జయభేరి నిర్మాణం సంస్థకు హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే మేమే కూల్చేస్తామని హైడ్రా తన నోటీసుల్లో పేర్కొంది.
చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తున్న సంగతి తెలిసిందే. మాదాపూర్‌లో తుమ్మడికుంట చెరువులో నిర్మించిన ఎన్ కన్వెషన్ కొద్ది రోజుల క్రితం హైడ్రా కూల్చివేసింది. అలాగే దుర్గంచెరువు బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఆదివారం ఉదయం మాదాపూర్‌లోని సున్నం చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. దుండిగల్ పరిధిలోని లక్ష్మీ శ్రీనివాస విల్లాలను కూడా అధికారులు కూల్చేసే పనిలో నిమగ్నం అయ్యారు.
ఇవి కూడా చదవండి..
HYDRAA | దుండిగల్‌లో హైడ్రా కూల్చివేతలు.. లక్ష్మీ శ్రీనివాస విల్లాలు నేలమట్టం
KTR | డియర్ రేవంత్ రెడ్డి గారు.. ఈ విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు : కేటీఆర్