ఫలించిన పోలీసుల వ్యూహం

పక్కా ప్రణాళిక.. సీసీ కెమెరాల నిఘా
ప్రజల సహకారం... ప్రభుత్వ విభాగాల సమన్వయం
ఇన్సిడెంట్ ఫ్రీగా జీహెచ్ఎంసీ ఎన్నికలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో రాజకీయ పార్టీల వాడీవేడి ప్రచారాలతో హోరెత్తి.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటాయనే అనుమానాలకు తావులేకుండా .. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికలను ఇన్సిడెంట్ ఫ్రీగా నిర్వహించారు. అటూ ప్రజలు ఇటూ పోలీసులు పరస్పర సహకారంతో శాంతి భద్రతలకు భంగం కల్గకుండా విజ యం సాధించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగానే బల్దియాలో పోటీచేసే అన్ని పార్టీల్లో హడావుడి ప్రారంభమయ్యింది. నోటిఫికేషన్ వెలువడగానే ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపిక.. బీ ఫారాలు అందజేత సమయాల్లో ఓ జాతీయ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చిన్న చిన్న వివాదాలు, ఆందోళన పరిస్థితులు శాంతి భద్రతలకు దారి తీస్తాయనే ఉద్దేశ్యంతో పకడ్బందీగా అన్ని అంశాలపై మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు ఫోకస్ పెట్టారు. ఏ సమస్య వస్తే ఎలా వ్యవహరించాలనే విషయంలో సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి, చిన్న ఘటనకు కూడా తావులేకుండా ఉండేలా హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, సజ్జనార్ పక్కా వ్యూహాలతో సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. ఒక పక్క జాతీయ స్థాయి నాయకులు నగరానికి రావడం.. వాళ్లు ప్రసంగాలు పాతబస్తీలో ఉండటంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేలా ప్రణాళికలు రూపొందించి, ఆయా పార్టీల ప్రచారాలకు ముందస్తు అనుమతులు జారీ చేశారు. దీంతో అన్ని పార్టీలకు చెం దిన ప్రధాన నాయకుల రోడ్ షోలు, ఒక పార్టీ.. మరో పార్టీ చేసే ప్రచార సమయాల్లో సమయాలను, రూట్లను మారుస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. మూడు కమిషనరేట్లలో 52 వేల మంది పోలీ సు సిబ్బంది జీహెచ్ఎంసీ ఎన్నికలకు బందోబస్తులో పాల్గొన్నారు. ఇందులో మూడు కమిషరేట్ల సిబ్బంది కూడా ఉన్నారు. బీజేపీ జాతీయ, మత వాదాలతో ప్రజల మధ్య విబేధాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తుందనే దుమారం రావడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితులను గమనిస్తూ తగిన నిర్ణయాలు తీసుకున్నారు.
నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి..
నవంబర్ 17న జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వెంటనే పోలీసు శాఖ అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ తగి న చర్యలు తీసుకుంది. మరో పక్క శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు పెట్రోలింగ్ వ్యవస్థకు తగిన సూచనలు చేస్తూ, డయల్ 100కు కాల్‌వస్తే 5 నిమిషాల్లోపే ఘటనస్థలికి చేరుకోవాలని సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ప్రచారాలు ఒక వైపు.. ఎన్నికల నిర్వహణ మరో వైపు.. ఎన్నికల సంఘం అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికబద్ధంగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 1న ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగియగానే.. బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించి, 24/7 అక్కడ సాయుధ గస్తీ, సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఎన్నికల నిర్వహణలో సీసీ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తూ చిన్న ఘటనకు కూడా తావివ్వకుండా పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో హైదరాబాద్ పోలీసులకు దేశ వ్యాప్తం గా మరింత ప్రతిష్ట పెరిగింది.
తాజావార్తలు
- రేపు సర్వార్థ సంక్షేమ సమితి 28వ వార్షికోత్సవాలు
- కేంద్ర బడ్జెట్ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
- బెస్ట్ సెల్లింగ్ మారుతి ‘స్విఫ్ట్’
- రైతుల ట్రాక్టర్ పరేడ్‌కు అనుమతి
- ఇక నుంచి వీళ్లూ పన్నుకట్టాల్సిందే...?
- కంబోడియాలో క్రేజీ ‘బీరు యోగా’!
- చెన్నైలోనే ఐపీఎల్ -2021 వేలం!
- వాట్సాప్ కు ధీటుగా సిగ్నల్ ఫీచర్స్...!
- బైడెన్ జీ! మీ నిబద్ధత అమెరికా విలువలకు ప్రతిబింబం!!
- పెట్టుబడులకు తెలంగాణ అనుకూలం : మంత్రి కేటీఆర్