హైదరాబాద్ : వెలుగులు నింపాల్సిన దీపావళి(Dipavali) పండుగ వారి కుటుంబంలో చీకట్లను మిగిల్చింది. దీపాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవాలని ఆశపడ్డ వారికి తీవ్ర నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళ్తే.. దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్(High tension wire) తగిలి బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఈ విషాదకర సంఘటన అంబర్పేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. కాగా, అభి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంటిపై హై టెన్షన్ వైర్ తగిలి బాలుడికి తీవ్రగాయాలు
అంబర్పేటలో దీపావళి పండగ సందర్భంగా లైటింగ్ ఏర్పాటు చేస్తుండగా, ఇంటి పైనుంచి వెళ్తున్న హై టెన్షన్ వైర్ తగిలి అభి(14) అనే బాలుడి శరీరం పూర్తిగా కాలిపోయింది.
బాలుడిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా… pic.twitter.com/lG9JpCkQxB
— Telugu Scribe (@TeluguScribe) October 30, 2024