ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ సీపీజీఈటీ(TG CPGET) పరీక్షలను వచ్చే నెల నాలుగవ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ.పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రూ. 500 అపరాధ రుసుముతో 24వ తేదీ వరకు, రూ. 2000 అపరాధ రుసుముతో 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచించారు.
ఇవి కూడా చదవండి..
Crime news | తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు.. టీనేజీ పిల్లలతో ఆ పని చేయించారు..!
Radhika Yadav | తండ్రి చేతిలో హత్య.. రాధికపై నాలుగు రౌండ్ల కాల్పులు.. అటాప్సీ రిపోర్టులో వెల్లడి