Crime news : తీసుకున్న అప్పు తిరిగివ్వనందుకు ఇద్దరు టీనేజీ బాలురపట్ల కర్కశంగా ప్రవర్తించారు. బెల్టు తీసుకుని తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగక వారిని ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని ఆదేశించారు. ఆ బాలురు అందుకు ఒప్పకోకపోవడంతో బెదిరించి మరీ చేయించారు. ఆ దృశ్యాలను వీడియో తీశారు. అప్పు చెల్లించకపోతే ఆ వీడియోలు బయటపెడుతామని బెదిరించి వదిలేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ ముంబైకి చెందిన ఓ 19 ఏళ్ల బాలుడు, పర్భనికి చెందిన ఓ మైనర్ బాలుడు గౌతమ్ దిలీప్ గోస్వామి అనే వ్యక్తి దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తిరిగి చెల్లించకపోవడంతో దిలీప్ గోస్వామి మనుషులు ధీరజ్, భరత్, పంజుభాయ్ గోస్వామి.. బాలురు ఇద్దరిని పర్భని నుంచి కారులో ఎక్కించుకుని ముంబైకి తీసుకెళ్లారు. అక్కడ వారి కార్యాలయంలో బాలురను బంధించి బెల్టుతో తీవ్రంగా కొట్టారు.
అంతటితో ఆగక ఆ ఇద్దరినీ ఒకరితో ఒకరు ఓరల్ సెక్స్ చేయాలని చెప్పారు. అందుకు బాలురు నిరాకరించడంతో తీవ్రంగా కొట్టి మరీ ఆ పని చేయించారు. అంతేగాక ఆ దృశ్యాలను తమ మొబైల్స్‌లో రికార్డు చేశారు. ఇప్పటికైనా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే ఆ వీడియోలను బయటపెడుతామని బెదిరించి వదిలేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.