KTR | సింగరేణిలో అవినీతి వెలికితీశాక పాలకుల్లో వణుకు మొదలైందని. తెలంగాణ సీఎం కోల్ మాఫియాకు నాయకుడిలా మారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు బొగ్గు గనుల కేటాయింపులపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఫిర్యాదు చేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏ బొగ్గుగనిలో లేని నిబంధన ఇక్కడనే ఎందుకు పెట్టారంటే ఇంతవరకు సమాధానం రాదన్నారు. నిజంగనే 2018 నుంచి 2024 వరకు ఈ నిబంధనను కేంద్రప్రభుత్వం సిఫారసు చేసి ఉంటే.. ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తరపున అన్ని టెండర్లను కూడా మేం పారదర్శకంగా పిలిచినం. అందుకే ఆ రోజు అన్నీ మైనస్ టెండర్లు వచ్చినయ్. ఎస్టిమేటివ్ కంటే తక్కువ ఖర్చుకే సింగరేణికి డబ్బులు ఆదా చేస్తూ ఆ రోజు జరిగిన మాట వాస్తవమా.. కాదా..? అని ప్రశ్నించారు. మరి ఆ రోజు టెండర్లలో లేని షరతు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సైట్ విజిట్ సర్టిఫికేషన్ విధానం ఎందుకు పెట్టారు…? ఎవరికి లాభం చేయడానికి పెట్టారు. అంటే ఇంతవరకు ప్రభుత్వంలోని బాధ్యులు ఏ ఒక్కరూ కూడా సమాధానం చెప్పడం లేదన్నారు కేటీఆర్ .
2025-26లో నిజానికి జనవరిలో ఈ నిబంధనలు లేకుండా ఒక టెండరు చేశారు. జనవరిలో టెండరు వేస్తారు.. మళ్లీ వెంటనే ఆ టెండరు రద్దు చేశారు. టెండర్లలో ఈ నిబంధన లేకుండా ఆ రోజు మీరు టెండరు పిలిస్తే మైనస్ -7 శాతానికే పనిచేస్తామని (అంటే 100 రూపాయలకు ఎస్టిమేట్ చేస్తే 93 రూపాయలకే పనిచేస్తామని) కాంట్రాక్టు సంస్థలు ముందుకొచ్చాయి. కానీ మీరు దాన్ని రద్దు చేశారు. ఈ నిబంధన పెట్టారు. దాని వల్ల తిరిగి మళ్లీ అదే ప్లేస్‌లో టెండర్ పిలిస్తే +12 (అంటే 100 రూపాయలకు అయ్యే పని 112 రూపాయలు) కావాలని చెప్పి సంస్థలు వచ్చిన మాట వాస్తవమా.. కాదా అని చెప్పాలని ప్రభుత్వాన్ని మేం డిమాండ్ చేస్తున్నామని కేటీఆర్ అన్నారు.
కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే..
మీరు నిబంధన పెట్టిన మే 25 నుంచి ఈ రోజు వరకు గత 9 నెలల్లో ఎన్ని సంస్థలు ఎంతమంది కాంట్రాక్టర్లు స్థలాన్ని (సైట్‌ను) సందర్శించారని కేటీఆర్ కేటీఆర్ . మీకు ఎన్ని ఈమెయిల్స్ వచ్చినయి. ఎన్ని లేఖలొచ్చాయి. సింగరేణి సంస్థ ఎన్ని సర్టిఫికెట్లు జారీ చేసిందని మీరొక శ్వేత పత్రం విడుదల చేయండి అని మేం డిమాండ్ చేస్తే ఇంతవరకు సమాధానం లేదన్నారు కేటీఆర్. కొంతమందికే సెలెక్టివ్‌గా ఎందుకిచ్చారు మీరు. కొంతమంది కాంట్రాక్టు సంస్థలనే మీరు ఎందుకు ఎంచుకుంటున్నారు. మిగతావాళ్లనెందుకు పక్కనపెడుతున్నారు. ఇందులో రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి బావమరిది అవునా..కాదా అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. ఇంతవరకు ఆయన విషయంలో స్పష్టం లేదని చెప్పారు కేటీఆర్.
ఒక్క నైనీ బొగ్గు గని టెండర్లే కాదు.. నైనీలో కూడా 2021, 2022లో రెండుసర్లు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా టెండర్లు పిలిచాం. కానీ ఆ రోజు ఈ సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే నిబంధన లేదు. మరి ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిబంధన ఎందుకు అవసరమొచ్చింది. అని మేం అడిగితే ఇంతవరకు సమాధానం లేదన్నారు.
Live: సింగరేణి కుంభకోణంపై గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు.@KTRBRS https://t.co/lDBKkbFXpD
— BRS Party (@BRSparty) January 27, 2026