MLC Vijayashanti | ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆ వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమైందని సొంత పార్టీకి చెందిన నేతలే స్వయంగా ఒప్పుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నటి విజయ శాంతి శాసనమండలిలో ఉద్యమ కారుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీస్తున్నాయి.
శాసనమండలిలో విజయ శాంతి మాట్లాడుతూ.. ఉద్యమ కారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తానన్నారు. రూ.4 వేలు పెన్షన్, రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇలా ఇంకా అనేక వాగ్ధానాలు చేశారు. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది.. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అన్నీ జరిగిపోయాయి. చూస్తుండగానే రెండు సంవత్సరాలు అయిపోయింది.. ఇంతవరకు మా ఉద్యమకారులకు మా ప్రభుత్వం ఇవ్వలేదు. అది కొంచెం నాకు బాధగా అనిపించింది. మనం ఎన్నో స్కీంలు అనౌన్స్ చేస్తున్నాం. పెడుతున్నాం. మా ఉద్యమకారులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చేసి ఉంటే.. మనం కదా చెప్పాం. ఉద్యమకారులకు ఇల్లు, పెన్సన్ ఉద్యోగం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనమే చెప్పాం కదా. అవన్నీ మొదటి ప్రాధాన్యత ఇచ్చి ముందే చేసి ఉంటే గౌరవంగా ఉండేదన్నారు విజయ శాంతి .
ఇవాళ పరిస్థితి ఏమైందంటే.. ఉద్యమకారులడుగుతున్నారు.. అయ్యా మీరు కదా మాకు హామీనిచ్చారు. ఏమైందని వాళ్లు చాలా గౌరవంగా, మర్యాదగా అడిగారు. కానీ ఎందుకు ఆలస్యమైందో నాకు తెలియదు. కమిటీ వేస్తామని చెప్పారు. నా ఉద్దేశంలో కమిటీ అనేది ఆలస్యమవుతది. ఇప్పటికే మా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు పైనే అయిపోయింది. తొందరగా మనం వాళ్లకిచ్చిన వాగ్ధానం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఉద్యమకారులకు మనం ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి
ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు రూ.25 వేల అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది..… pic.twitter.com/jD9KNoYrkY
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా