ollegal రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కలకలం సృష్టించిన టెకీ సీతారాం ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో సీతారాం రాసిన 19 పేజీల సూసైడ్ నోట్ బయటకు రావడంతో ఆత్మహత్యకు గల కారణాలు తెలిశాయి.
భార్య వివాహేతర సంబంధాలతో విసిగిపోయి సీతారాం ఆత్మహత్య చేసుకున్నట్టు నోట్ ద్వారా వెల్లడించాడు. తన వద్దని చెప్పినా వినలేదని సీతారాం పేర్కొన్నాడు. ఏపీలోని మార్కాపురానికి చెందిన సీతారాం, నంద్యాలకు చెందిన రేణుకకు 2018లో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సీతారాం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సీతారాం కుటుంబం బాచుపల్లిలో స్థిరపడ్డది. అయితే రేణుక తన భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకొని, ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. ఆ దారుణాలు చూడలేక భర్త సీతారం హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
భర్తకు తెలియకుండా ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకున్న రేణుక రమణారెడ్డి అనే వ్యక్తితో కలిసినప్పుడు ప్రైవేట్ వీడియోలు తీసుకుంది. ఆ వీడియోలను రమణారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. తన భార్య నిజ స్వరూపం తెలిసిన సీతారాం ఫిబ్రవరి నెలలో 19 పేజీల సూసైడ్ లేఖ రాసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ముగ్గురితో వివాహేతర సంబంధం..
సూసైడ్ లేఖలో నా భార్య రేణుకకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె ఏడాదిన్నరలోనే ముగ్గురితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసుకోగా.. ఓ లవర్ దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ దారుణాలను చూసి నేను ఎలా తట్టుకోగలగాలి.. అసలు రేణుకకు ఏం కావాలి. ప్రేమనా లేక శృంగారమా..? నా భార్యకు ఏలోటు రాకుండా చూసుకున్నా.. కానీ ఆమె నాకు నమ్మక ద్రోహం చేసింది అంటూ తన ఆవేదన తెలుపుతూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు జరిపి రేణుకతోపాటు ఆమె ఇద్దరు లవర్స్ రమణారెడ్డి, శ్రవణ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుక నమ్మకద్రోహం వల్ల నెలకు రూ.2 లక్షలు సంపాదించే సీతారాం ప్రాణాలు పోగొట్టుకున్నాడని, ఇద్దరు పిల్లలు అనాథలు అయ్యారని కుటుంబసభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.