Talasani srinivas Yadav | పరిపాలన చేతకాక ప్రశ్నించే వారిపై ఎదురుదాడి.. గేట్ మీటింగ్‌లో మాజీ మంత్రి తలసాని
Talasani srinivas Yadav | వాటర్ వర్క్స్ బోర్డులోని ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న రాంబాబు యాదవ్‌ను 6 వ తేదీన జరిగే గుర్తింపు ఎన్నికలలో గెలిపించుకోవాలని మాజీమంత్రి, బీఆర్ ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.
Talasani srinivas Yadav | ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై పోరాడేది గులాబీ జెండా మాత్రమేనని మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఖైరతాబాద్ లోని జలమండలి కార్యాలయం వద్ద నిర్వహించిన గేట్ మీటింగ్‌కు ఆయన హాజరై ప్రసంగించారు. వాటర్ బోర్డులో 50 సంవత్సరాల లో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ ప్రభుత్వం 650 మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
వాటర్ వర్క్స్ బోర్డు లోని ఉద్యోగులు, కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న రాంబాబు యాదవ్‌ను 6 వ తేదీన జరిగే గుర్తింపు ఎన్నికలలో గెలిపించుకోవాలని తలసాని పిలుపునిచ్చారు. మున్సిపల్ శాఖను తన వద్ద పెట్టుకున్నముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలలో ఒక్కసారైనా సమీక్ష చేశారా? అని తలసాని ప్రశ్నించారు. మీ సమస్యలపై ముఖ్యమంత్రికే పట్టింపు లేనప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేతకాక ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేస్తున్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని తలసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ..
ఈ ప్రభుత్వం అవగాహన, ప్రణాళిక లేకుండా మూడు కార్పొరేషన్లుగా విభజించి ఉద్యోగులు, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని తలసాని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ రోజు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా త్రాగునీటిని సరఫరా చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం త్రాగునీటిని కూడా సక్రమంగా ఇవ్వలేకపోతుందని మండిపడ్డారు. మీకు అండగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ అని, మీ హక్కుల కోసం అసెంబ్లీ లోపల, బయట ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు.
మీ కోసం గొంతుక వినిపించే గులాబీ జెండాకు మద్దతు తెలపాలని తలసాని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో బోర్డులోని అనేక సమస్యలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. అటు సూర్యుడు ఇటు పొడిచినా మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తలసాని హామీ ఇచ్చారు.
Live: హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) గేట్ మీటింగ్ https://t.co/sc0OLnzo31
— BRS Party (@BRSparty) June 4, 2026
Read Also :
Ameerpet Fire Accident | అమీర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం.. షాపింగ్ మాల్లో ఎగసిపడుతున్న మంటలు
Chiranjeevi | ‘పెద్ది’ విజయంపై చిరంజీవి ఎమోషనల్ ట్వీట్.. చరణ్ కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది..
‘వార్డు సభల్లో ప్రజలు భాగస్వాములు కావాలి’
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

