మూసాపేట మార్చి 29 : డివైడర్‌ను ఢీ కొట్టి లారీ బోల్తా పడిన సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి ఎర్రగడ్డకు చెరుకులోడుతో వెళ్తున్న లారీ ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో లారీలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉండడంతో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
BRS | రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన
Movie Title | ఒకే టైటిల్‌తో ముగ్గురు హీరోల సినిమాలు .. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్