Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు అందజేశారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు.
జూబ్లీహిల్స్ పీఎస్‌లో విచారించనున్న నేపథ్యంలో.. జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌కు రావాలని సిట్ అధికారులు కేటీఆర్‌కు నిర్దేశించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కేసులో 2024 మార్చి 10 నుంచి సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నదని, ఇప్పటికే కొంతమంది నిందితులపై ప్రధాన చార్జిషీటు దాఖలు చేశామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ వెల్లడించారు.